మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది.. సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచే తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చేస్తున్నారు. చిరంజీవి సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూశారు. తెల్లవారుజామున ఏపీలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుండి పడ్డాయి. బాహుబలి ఇండియన్ సినిమాకే ఒక గ్రేట్ ఎంబ్లెమ్‌లా నిలిచినా రీసెంట్‌గా వచ్చిన సాహో విఫలమైంది. అయితే సాహో పాన్ ఇండియా సినిమా కావడం.. పైగా బాహుబలిలో నటించిన ప్రభాస్ హీరో కావడంతో సాహోపై భారీ అంచనాలు పెట్టుకుని ప్రీమియర్స్‌కి టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే సాహో నిరాశపరచడంతో చాలామంది సైరా చూసేందుకు వెనుకంజ వేసారు. సాహో రిలీజ్ అయిన నెలకు సైరా రిలీజయ్యింది. దీంతో సాహోచూసి డిసప్పాయింట్ అయిన చాలామంది దీనికి టికెట్స్ బుక్ చేసుకోలేదు. అందుకే ప్రీమియర్స్‌తో సునాయాసంగా మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంటుందనుకున్న సైరా ఆ మార్క్ చేరుకునే పరిస్థితి కనిపించటం లేదు. చిరంజీవి మ్యాజిక్ పూర్తిగా వర్కఅవుట్ కాలేదట..
ప్రస్తుతం 8లక్షల డాలర్స్‌కి చేరువగా ఉన్నాయి సైరా ప్రీమియర్స్ కలెక్షన్స్. దీంతో మిలియన్ డాలర్స్‌ని టచ్ చెయ్యడం అసాధ్యంగా కనిపిస్తుంది. పైగా ఇది బుధవారం రిలీజ్ అవుతుండడంతో ఇక్కడ హాలిడేనే కానీ ఓవర్సీస్‌లో మాత్రం వర్కింగ్ డే కావడంతో ప్రీమియర్స్ కలెక్షన్స్ తగ్గాయి అనేది కారణం. అయితే సైరాకి టాక్ బావుండడం వల్ల రేపటినుండి కలెక్షన్స్ పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదు. బాలీవుడ్‌లో సైతం మంచి టాక్ ఉంది. దీంతో ఈ వీకెండ్స్‌లో తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్‌కి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్స్ కలెక్షన్స్ కాస్త నిరాశపరచినా తెలుగులో ఇండస్ట్రీ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మొత్తానికి సినిమా విజయవంతం కావడంతో నిర్మాత చరణ్, నటుడు చిరంజీవి అదే తండ్రీకొడుకులిద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.