విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. అంతేకాకుండా మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అదేమిటంటే క్రికెట్ దేవుడు బ్రాడ్ మాన్ స్వదేశంలో 98.22 సగటుతో మొదటి స్థానంలో ఉండగా..రోహిత్ శర్మ 91.22 సగటుతో ఉన్నాడు. ఈ ఫీట్ మరెవ్వరు సాధించలేరనే చెప్పాలి..!