హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ గాంధీ జయంతి రోజున టెస్టుల్లో ఓపెనర్ గా ఆడిన మొదటి మ్యాచ్ లోనే శతకం సాధించాడు. దాంతో మూడు ఫార్మాట్లో ఓపెనర్ గా సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ గా చరిత్ర నిలిచాడు.
