రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసిన అభిమానులు రానాకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రానాకు ఏమైంది అనే విషయానికి వస్తే దగ్గుబాటి కుటుంబం అధికారికంగా చెప్పనప్పటికీ ఆయన అమెరికాలో కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడని, ఈ మేరకు కొన్ని షూటింగ్ కూడా ఆగిపోయాయని అంటున్నారు. అంతటి బలమైన బాడీ ఉన్న రానా సడన్ గా ఇలా కనిపించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ఇక ట్రీట్మెంట్ అనంతరం త్వరలోనే షూటింగ్ లో పాల్గుంటాడని తెలుస్తుంది.