తెలంగాణ రాష్ట్ర మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన ప్రతిక్ష పార్టీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేదు . కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేపార్టీ ..
ఆ పార్టీలో ఒకరిద్దరూ తప్ప అందరూ ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళే . అటువంటి పార్టీని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని “సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకామాట్లాడుతూ” ఇప్పటిదాకా తెలంగాణలో కుటుంబ పాలన అని విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి అయిన పద్మావతి రెడ్డిని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నిలబెట్టడం కుటుంబ రాజకీయాలు కావాఅని “విమర్శించారు.
ఎమ్మెల్యేగా ఉండటమే కాకుండా గతంలో మంత్రిగా ఉండి కూడా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు . హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.
ఈసారిగెలుపు మాదే . గత ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగిన టీడీపీ ,కాంగ్రెస్ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం తిట్టుకుంటున్నాయి . ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారు అని ఆయన అన్నారు ..
Post Views: 195