టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేసిన పాదయాత్ర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సరిగ్గా 7 సంవత్సారాల క్రితం ఇదే గాంధీ జయంతి రోజున తన పాదయాత్ర ప్రారంభించానని ట్విట్టర్ లో వెల్లడించారు. మహాత్ముడి స్ఫూర్తిగా ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టానని, 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకున్నానని, వారి జీవనగమనంలో తాను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు జన్మ ధన్యమైందని భావిస్తున్నానని భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. తన పాదయాత్ర ఫొటోలను కూడా చంద్రబాబు ట్వీట్ కు జోడించారు.
ఏడేళ్ళ క్రితం ఇదే గాంధీ జయంతిన ఆ మహానుభావుని స్ఫూర్తితో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను ప్రారంభించాను. 208 రోజులు, 2817 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకుంటూ… వారి జీవన గమనంలో నేను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు నా జన్మ ధన్యమైంది.#7YearsforVastunnaMeekosam pic.twitter.com/jwJWTD0FbS
— N Chandrababu Naidu (@ncbn) October 2, 2019