ఇటీవల చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్2 తో పంపిన విక్రమ్ పై ఇస్రో ఆశలు వదులుకోలేదు. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు పది రోజులు విరామం మాత్రమే ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం మొదలు కాగానే సూర్యుడి కిరణాలు పడి విక్రమ్ తిరిగి కదలిక రావచ్చని వారు చెబుతున్నారు. ఆ తర్వాత తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు.