కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇడ్లీ ఈటింగ్ కాంపిటీషన్ను మహిళలకు నిర్వహించారు. ఒక్క నిమిషంలో ఎవరైతే ఎక్కువ ఇడ్లీలు తింటారో వారే విజేత. అయితే ఈ కాంపిటీషన్లో 60 ఏళ్ల వృద్ధురాలు ఒక నిమిషంలో ఆరు ఇడ్లీలను తినేసి విజేతగా నిలిచారు. ఇడ్లీని తినేందుకు సాంబారు కూడా ఇచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన సరోజమ్మను నిర్వాహకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్లో దసరా ఉత్సవాలను పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
Tags 6 idlis 60 seconds 60-yr-old competition Mysuru woman win
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023