ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని అందరు భావించారు కాని ప్రస్తుతం తన ఆట తీరు చూస్తుంటే అతడికి కూడా కష్టమే అనిపిస్తుంది. ఇక ఈ రేస్ లో పంత్ కు పోటీగా ముగ్గురు ఉన్నారు. భరత్, సంజు శాంసన్, ఇషాన్ కిషణ్ ముగ్గురూ పంత్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక భరత్ విషయానికి వస్తే వెస్టిండీస్ టూర్ కు కొన్ని పాయింట్లు వెనకబడడంతో జట్టులో స్థానం కోల్పోయాడని ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా ఎప్పటికైనా అతడు ఇండియా జెర్సీ లో కనిపిస్తాడని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కేరళ ఆటగాడు విషయానికి వస్తే అతడి కోసం యావత్ భారతదేశానికి తెలిసిందే. ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక మూడో ప్లేయర్ కిషాన్… ఈ ముగ్గురితో పంత్ కు గట్టి పోటీనే రానుంది. దాంతో పంత్ పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా మారింది.