సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. అంతేకాకుండా ఎంతోమంది ఇప్పటికి తననే గుర్తుచేసుకుంటూ భాదపడుతున్నారు. ఇదే క్రమంలో హాస్య నటుడు వెన్నెల కిశోర్ కూడా ఆయనను తలచుకుంటూ మాట్లాడిన మాటలు ఇవి..!
మొన్న ఆదివారం నాడు జరిగిన ‘సంతోషం 17వ సౌతిండియా’ అవార్డ్స్ ప్రారంభం సర్ధర్భంగా పద్మశ్రీ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం అవార్డు దక్కింది. తనకి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, నాకు వచ్చిన ఈ అవార్డు నా స్నేహితుడు వేణు మాధవ్ కి అంకితం ఇస్తున్నానని చెప్పాడు.