తెలంగాణ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉమ్మడి వరంగంల్ జిలాల్లో పర్యటిస్తున్నారు. రెండవ రోజు ఉదయం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గోన్న స్వామివారు రాజశ్యామలా దేవికి పీఠ పూజ, చండీపూజ, దుర్గా సప్తశతి సహిత పూజ, రుద్రాభిషేకం వంటి పూజలు చేశారు. . ఈ సందర్భంగా చండీపారాయణం, మహిళల కుంకుమపూజ, శ్రీ లలితా సహస్ర నామార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారు స్వయంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందజేశారు. తదనంతరం వరంగల్‌లోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత పైడిపల్లి లో కాకతీయుల కాలం నాటి పురాతన అమ్మవారి సమేతంగా కొలువై ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. శివాలయంలోని అమ్మవారి విగ్రహం కొలువుదీరడం గ్రామానికి ఎంతో శ్రేష్టమైనదని, ఇక్కడి ప్రజలు ఎంతో పుణ్యవంతులని స్వామి అన్నారు. ఈ ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉందని అమ్మ వారితో కొలువై ఉన్న కొన్ని ఆలయాల్లో ఇది ఒక ఆలయం అని పేర్కొన్నారు. తదనంతరం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ గోవిందాద్రి గుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని , శ్రీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి అనుగ్రహభాషణం ఇచ్చారు. లోక కల్యాణార్థం వరంగల్ వచ్చానని తెలిపారు. నగర నడిబొడ్డున మహిమాన్విత గల కొండ ఉండడం, ఏ శిలను పలుకరించినా గోవింద నామమే వినిపిస్తోందన్నారు. దసరా పండుగ సందర్భంగా రాజశ్యామల యాగం చేస్తున్నట్లు స్వామిజీ తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎల్లవుల కుమార్ లలిత యాదవ్, దరువు ఎండీ చెరకు కరణ్ రెడ్డి, పోలపల్లి రాంమూర్తి, ఈట్టబోయిన తిరుపతి, ఆయా ఆలయాల అర్చకులు, వేదపండితులు, ఆలయాల సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు.