మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని నిర్లక్ష్యం చేయలేదు. పరిష్కారాలను వేగంగానే ప్రజలముందుంచుతున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పాలనలో ఇసుక ఉచితం అని మాయచేసి తెలుగు తమ్ముళ్లు ఇసుక మాఫియాలో ఎలా హద్దు మీరిపోయారో చూసాం. ఇసుక అక్రమాలపై తిరగబడ్డ ఏర్పేడు గ్రామవాసులు 20మందిని లారీలతో తొక్కించి చంపారు.
ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న అధికారులను జుట్టు పట్టుకుని ఈడ్చిన సంఘటనలు చూసాం.. ముఖ‌్యంగా ఏడాదికి 800కోట్ల ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాకుండా చేసారు. టీడీపీ నాయకుల ఆస్తిలా కోటానుకోట్లు అక్రమ వ్యాపారాలకు ఊతమిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వరుణుడు కరుణించాడు. పుష్కలంగా వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. పై రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఏపీలోనూ వరదలు ముంచెత్తాయి. ఈ పరిస్థితిలో ఇసుక తవ్వితీయడం సాధ్యం కాదు.. ఏ ప్రభుత్వానికీ కాదు. కానీ ఈ కారణాలను ప్రజలకు చెప్పకుండా ఇసుకకొరత అంటూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నాడు. నిజానికి వర్షాల సీజన్ లో నిర్మాణ రంగం సాధారణంగా మందగిస్తుంది. ఇవన్నీ దాస్తూ బాబు కేవలం ఇసుక కొరత వల్లే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ ఇసుక కొరతను అధిగమించే విధానాలను ప్రకటించారు. వీలైనన్ని ఎక్కువ రీచ్ లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇసుక పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ నిర్ణయాలతో ప్రజలకు ఇసుక లభ్యత, ఇటు ప్రభుత్వానికి ఆదాయం రెండూ సాధ్యమవుతున్నాయి.