మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సిపిమాపై పిటిషన్ వేశారు. బయోపిక్ గా తీయవలసిన ఈ సినిమాలో చరిత్రను తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సినిమాను వినోదపరంగానే చూడాలని స్పష్టం చేసింది.ఎంత మంది మహానుభావుల చరిత్రను యధాతదంగా చూపించారని హైకోర్టు ప్రశ్నించింది. గాంధీజీ,మొగల్ సామ్రాజ్యం పై వచ్చిన సినిమాలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది.బుదవారంనాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Tags green signal high court mega star chiramjeevi\ movie realese saira narashimha reddy