మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు -సైరా- సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. సైరా చూస్తున్నంత సేపూ రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే తన కోసం వేచి చూసేలా అత్యద్భుతంగా నటించారు. నర్సింహారెడ్డి ఇలాగే ఉండేవారేమోననే రీతిలో చిరంజీవి ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని ఉమైర్ వరుస ట్వీట్లు చేశారు. ఉమైర్ సింధు ట్వీట్లతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు.