మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని నిర్లక్ష్యం చేయలేదు. పరిష్కారాలను వేగంగానే ప్రజలముందుంచుతున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన హయాంలో కరెంటు కోతలు లేవని, ఇప్పుడు రాష్ట్రమంతా చీకట్లో మగ్గిపోతోందని కోతలు కోస్తున్నారు.. కొన్నిగ్రామాల్లో ఉన్న విద్యుత్ అంతరాయాలను భారీ సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజలను భయపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
కానీ గత పాలనలో అధికధరలకు విద్యుత్ కొనుగోలు చేసి తనవారికి వందల కోట్లు దోచిపెట్టిన సంగతి బయటపెట్టట్లేదు. రాష్ట్రంలో 60% విద్యుదుత్పత్తి సంప్రదాయ పద్ధతుల్లో అంటే బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుండి వస్తుంది. ఈ బొగ్గును ఒరిస్సా లోని కోలార్ గనుల నుంచి ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది.. ప్రస్తుతం కోలార్ గనుల్లో కార్మికుల ఆందోళనలు, సమ్మెల వల్ల కొద్ది రోజులుగా బొగ్గు సరఫరా కూడా నిలిచిపోయింది. మొత్తం 1100 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. అలాగే డిస్కంలను చంద్రబాబు 25000కోట్ల అప్పుల్లో ముంచారు. ఇప్పుడు బకాయిలు జగన్ ప్రభుత్వం తీర్చుతోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కూడా 1,276 కోట్లు, కేంద్ర సంస్థ NTPCకి 3,413 కోట్లుమొత్తం 4,690 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తూ డిస్కంల అప్పులు తీర్చుతున్నారు.. అలాగే కేంద్రానికి బొగ్గును నిరంతరాయంగా సరఫరాను చేయమని కోరారు. తెలంగాణ సింగరేణినుండి వచ్చే 4ర్యాకులను 9కి పెంచి ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేసారు. త్వరలో విద్యుత్ కోతలు అధిగమిస్తామని సీఎం చెప్తూ ఆవిధంగా ప్రణాళికలు చేస్తుంటే చంద్రబాబు తాను చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇపుడు ప్రభుత్వాన్ని అడ్గోలుగా విమర్శిస్తున్నారు.