అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. దానికది సొంతగా తయారయ్యి. మనుషుల నుండే వేరే మనిషికి ఎక్కించాలి. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీలు ఈ పద్దతితి మొదలుపెట్టారు. ప్రత్యేకించి రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు.
