ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ ను కలవాలని సోమవారం రేణుగుంట విమానాశ్రయానికి వచ్చారు.జగన్ వచ్చిన అనంతరం ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన గ్యాలరీలో ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వినిపించి తన అన్నకు ప్రాణభిక్ష పెట్టమని కోరుకున్నారు.
తమ అన్న హరికృష్ణ తిరుపతిలోని రవీంద్రభారతి లో 10వ తరగతి చదువుతున్న సమయంలో 2015 నవంబర్ 21న స్కూల్ సిబ్బంది బిల్డింగ్ నుండి తోసేసారని. దాంతో మూడేళ్ళు కోమాలోనే ఉన్నాడని,ఇప్పటికే చెన్నై లోని ఆశుపత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేసారని వివరించారు. ఈ మేరకు 10లక్షలు ఆర్ధిక సాయం చేయమని వారిద్దరూ సీఎంను కోరారు. పాపం వారి ఆవేదన అర్ధం చేసుకున్న జగన్ ఒక్కసారిగా చలించిపోయారు. అనంతరం ఆ చిన్నారులకు ధైర్యం చెప్పి ఓదార్చి మీకు అండగా నేనున్నానని హామీ ఇచ్చి మానవతా దృక్పధంతో హరికృష్ణ వైద్యానికి సంబంధించి ఖర్చుల కోసం 10లక్షలు వెంటనే మంజూరు చేయమని అధికారులకు చెప్పాడు. అంతేకాకుండా ఆ చిన్నారుల చదువు నిమిత్తం మరో 5లక్షలు ఇవ్వమని అధికారులకు ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఆ చిన్నారులకు జగన్ చేసిన సాయానికి గాను హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.