దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగనాలు నివారించవచ్చు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో సీసీ కెమెరాలను గమనించి దొంగలు వెనకడుగు వేశారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ జరిగిన దొంగలను త్వరగా పట్టుకోవచ్చు. సెలవుల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా కూడా చోరీలను అదుపు చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఇదివరకే ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాల ద్వారా రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు.
* ఇళ్లకు తాళం వేసి, ఊర్లకు వెళ్లే వారు పలు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
* ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్‌మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి
* రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి
* విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు
* ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి
* వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి
* పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది
* ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవడం మంచిది.
* కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి
* తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీసుస్టేషన్‌లో సమాచారం అందించాలి
ఇంటికి తాళం వేసే వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు. అలాగే రాత్రి వేళలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.