Home / 18+ / పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు

పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు

పిపిఎల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్నప్పటినుంచీ విపక్షం ఉలికులికి పడుతూనే ఉంది. ఎలా చేస్తారంటూ అల్లరి చేసారు. కేంద్రంకూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రావంటూ అడ్డుపుల్ల వేసింది, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో విద్యుత్ కొనుగోళ్లను జరిపి, ఖజానాకు 2600కోట్లు ఎందుకు భారం పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్ష అవకాశమే లేదని విద్యుత్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది.. విద్యుత్ నియంత్రణమండలికి వెళ్తామన్న ప్రభుత్వ అభ్యర్థనకు అనుమతిచ్చింది. విద్యుత్ నియంత్రణా మండలి తీసుకునే నిర్ణయాలను నిర్థారించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆరునెలల్లోసు పరిష్కారం సూచించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలిని ఆదేశించింది. అలాగే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చట్టప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయచ్చని తెలిపింది. ఇప్పటికే ఉన్న విద్యుత్ ను మాత్రం తిరిగి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రెగ్యులేటరీ కమీషన్ దగ్గర ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తుంన్నందువల్ల గతంలో జారీచేసిన జీవో పక్కన పెడుతున్నట్టు కోర్టు ప్రకటించింది.

 

అలాగే 2010లో యూనిట్ రూ.18 ఉన్న సౌర విద్యుత్ ధర 2018లో రూ.2.18 పైసలకు చేరింది. పవన విద్యుత్ ఉత్పత్తి ధర సైతం మూడేళ్లలో తగ్గి యూనిట్ రూ.4.20 నుంచి రూ.2.43 కు చేరింది. ఈ విషయాన్నిపార్లమెంట్లోనే ప్రస్తావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3 వేల మెగావాట్ల పవన్ విద్యుత్ యూనిట్ రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసింది. అది కూడా ధర్మల్, హైడ్రో పవర్ తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు ఇంత అధికంగా ప్రైవేటు సంస్థలకు ఎందుకు చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి, రోజుకు 7 కోట్లు నష్టం వస్తోందని సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి భారంగా ఉందని తెలిపారు. తాజాగా హైకోర్టు నిర్ణయంతో విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష కు రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టేననిపిస్తోంది. ఖజానా ఖాళీచేసిన చంద్రబాబు నిర్ణయాలను నేడు జగన్ ప్రభుత్వం సరిదిద్దుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat