టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే విధంగా రోహిత్ రాణిస్తాడని నమ్మకం ఉందని అన్నాడు. అతడికి ఏ సమయంలో ఎలా ఆడాలో తెలుసనీ, పూజారా ఫామ్ లో లేకపోవడంతో రోహిత్ ని ఓపెనర్ గా పంపుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు రోహిత్ మిడిల్ ఆర్డర్ బాట్స్ మాన్ గా బాగానే రాణించాడని అన్నాడు. ఒకప్పుడు వన్డేల్లో రోహిత్ ఓపెనర్ కాదని గుర్తుచేసాడు. అయితే రోహిత్ ని సెహ్వాగ్ తో పోల్చడంతో అభిమానులు ఒక్కసారిగా కోహ్లిపై మండిపడ్డారు.