ప్రముఖ క్రీడ పరికరాల తయారీ సంస్థ అయిన యాసిక్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఈ సంస్థకు చెందిన ఒక ప్రకటనల బోర్డులో నడిరోడ్డుపై దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. న్యూజిల్యాండ్ లో ఆక్లాండ్ నగరంలో ఉన్న యాసిక్స్ స్టోర్ ముందు ఉన్న డిస్ప్లే పై గత శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమవ్వడం కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో యాసిక్స్ సిబ్బంది వచ్చే స్క్రీన్ ని ఆపేసేవరకు అలానే ప్రసారం అయ్యాయి. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు ఇబ్బందికి ఫీలైన వారందరికీ ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది.
