టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈఏడాది ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ తనయుడు జగన్‌మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తిరుమల వెంకటేశుని ఆశీస్సులతో వైఎస్ కుటుంబానికే ఈ గౌరవం దక్కింది. శ్రీవారిపై వైఎస్ కుటుంబానికి భక్తి, విశ్వాసాలున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు, పాదయాత్ర పూర్తైన తర్వాత జగన్ వెంకన్నను కాలినడకను దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా జగన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ధ్వజారోహణ తర్వాత ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంనుంచి తలపై స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్ర్తా లు తీసుకెళ్తారు. ఆలయ మహ ద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్ ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు.