తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొలి ప్రభుత్వంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన సంగతి విదితమే. దీంతో తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణ సమాజం టీఆర్ఎస్ కు బ్రహ్మరథం కట్టారు.
ఈ నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది సర్కారు. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు ఊరట కలిగించే విధంగా మొత్తం యాబై ఎనిమిది రకాల ఉచిత పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది.
రక్తపరీక్ష మొదలు ,మలమూత్ర,మలేరియా,డెంగీ ,టైపాయిడ్ లను ఇలా మొత్తం యాబై ఎనిమిది పరీక్షలను ఉచితంగా నిర్వహించడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలను ఉచితంగా అందజేయనున్నది.