తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ,మాజీ హోం మంత్రి ,మాజీ ఎంపీ టి. దేవేందర్ గౌడ్ తనయుడు అయిన వీరేందర్ గౌడ్ ఈ రోజు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని నగర పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయిన వీరేందర్ గౌడ్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.
ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు,నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. వచ్చే నెల మూడో తారీఖున బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.