జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది. తన ఫేస్ బుక్ లో పవన్ పై జూగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి తీవ్రమవడంతో ప్రస్తుతం ఇంటివద్దనే రెస్ట్ తీసుకుంటూ త్వరలో ఆపరేషన్ కు ఉపక్రమిస్తున్న పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యానిస్తూ, ‘పవన్ కి వెన్నుపూస గాయాలంట కదా, పాపం అది పని చేస్తుందో లేదో, ఇప్పటికే చాలా వాడేసాడు, అరిగిపోయిందో ఏమో’ అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమెకు మెసేజెస్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది….!!
