తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సినీ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సండే ఫండే అంటూ వచ్చిన నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వులు పూయించాడు. ప్రతీ ఒక్కరి చేత టాస్కులు చేయించి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఉన్నవి లేనివి ఏవైనా కల్పించుకుని చేయండి.. కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండని హౌస్‌మేట్స్‌కు నాగ్ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లందర్నీ జంటలు విడగొట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరాడు. బిగ్‌బాస్ టీవీ ఉంటుందని.. ఏ కంటెంట్ అయిన వాడుకుని అందర్నీ నవ్వించాలని ఆదేశించాడు. దీనిలో భాగంగా మొదటగా వచ్చిన మహేష్-శివజ్యోతి.. బిగ్‌బాస్ ముచ్చట్లను ప్రేక్షకులకు వినిపించారు. తరువాత కొన్ని టాస్క్ ల అనంతరం రవి ఎలిమినేట్ అయినట్లు నాగర్జున ప్రకటించాడు. ఓటింగ్‌లో రవికే తక్కువ వచ్చాయి అందుకే ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి రవికృష్ణను బయటకు పంపించారు. గత వారం ఆల్రెడీ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అలీ రజా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఇటీవల సరదాగా కూర్చుని ఓ విషయాన్ని చర్చించుకున్నారు. ఒకవేళ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే, తాము ఏం చేస్తామో అందరూ చెప్పారు. రవికృష్ణ కూడా తాను ఎలిమినేట్ అయితే వెంటనే విజయవాడలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పాడు. దీంతో అతడికి బిగ్ బాస్ ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపాడు. ప్రేక్షకులు కూడ తల్లిదండ్రుల వద్దకు వెళ్తానంటే వద్దంటర అందుకే ఓట్లు వెయ్యకుండ మరి రవికృష్ణ కోరిక తీర్చారు.
