ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ నగదు వ్యవహారాలు అవసరం. బిజినెస్ వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయడం, డీడీలు జమ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి పని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెలవుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (అక్టోబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. పండుగ సీజన్ సహా పలు అంశాల నేపథ్యంలో వచ్చే నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ నెలలో 11 రోజులు సెలవులు ఉన్నాయి. అవి ఎప్పుడేప్పుడు ఒక్క సారి చూద్దాం.
అక్టోబర్ 2: గాంధీ జయంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 6,7,8: బ్యాంకులు ఈ మూడు రోజుల్లోనూ పనిచేయవు. అక్టోబర్ 6న ఆదివారం. అక్టోబర్ 7న రామ్ నవమి, అక్టోబర్ 8న దసరా సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.
అక్టోబర్ 12, 13: అక్టోబర్ 12న రెండో శనివారం. ఆరోజున బ్యాంకులు ఉండవు. ఇక అక్టోబర్ 13న ఆదివారం. ఈ రోజు ఎలాగూ బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 20: ఈ రోజు ఆదివారం. బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 26, 27: బ్యాంకులు నెల చివరి నాలుగు రోజులు పనిచేయవు. అక్టోబర్ 26న నాలుగో శనివారం. అక్టోబర్ 27న అదివారం. ఈ రోజే దీపావళి కూడా.
అక్టోబర్ 28, 29: అక్టోబర్ 28న గోవర్ధన్ పూజ ఉంటుంది. బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 29న భాయ్‌దూజ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే.. అక్టోబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 12, 26 (దీపావళి కూడా ఈ రోజే) తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే అక్టోబర్ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు 6, 13, 20, 27 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.