తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కల్హేర్ మండలంలో కొత్తగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఆసుపత్రి ఆవరణాన్ని పరిశీలించారు.
ఆసుపత్రిలో ప్రసవించిన గర్భిణీలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా బంగారు ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్వేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పని చేస్తుంది.
అందుకే కల్హేర్ లో రూ. ఆరు కోట్లతో ఆస్పత్రిని నిర్మించాం. గర్భిణీలకు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రసవాలు చేస్తున్నాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంతరావు తదితరులు పాల్గోన్నారు.