గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగం సాధించిన గంపగూడెం గ్రామానికి చెందిన ముత్యాలుకు సీఎం వైయస్ జగన్ నియామకపత్రం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొందరికి నియామక పత్రాలిచ్చారు. అవినీతికి తావులేకుండా గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగాయని సీఎం అన్నారు. సేవాభావంతో పనిచేయాలని కోరారు.
ప్రతీ పేదవాడి ముఖంలోనూ చిరునవ్వును చూడాలని కోరారు. లంచాలు తీసుకోవద్దని, వ్యవస్థలను బాగు చేయాలని కోరారు. ప్రతీ గ్రామ వలంటీర్ బాధ‌్యతగా వ్యవహరించాలన్నారు. మీమీ మండలాల్లోనే శాస్వత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మీ అదృష్టమన్నారు. 72గంటల్లోనే ఏ సమస్యకైనా పరిష్కారం చూపే మెకానిజం గ్రామ సచివాలయంలో ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎవ్వరికైనా మంచి జరగాలని, వివక్ష అవినీతి లేకుండా చేయాలన్నారు. అక్టోబర్ 2న ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగే సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. సచివాలయాల ద్వారా 1,34,918 ఉద్యోగాలు ఇచ్చారు. ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఎంపికైన వారు తెలిపారు.