ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య భర్తలు కష్టపడి ఓ కొడుకుని టీచర్ నిచేసి,మిగిలిన వాళ్ళను చేనేత, వృత్తి లో పట్టణాల్లో స్థిరపడేలా చేశారు. తమ స్తోమతకు తగ్గట్టుగా కుతుర్ల పెళ్లిళ్లు చేశారు. టీచర్ కొడుక్కి భార్యగా టీచర్ ని తెచ్చి పెళ్లి చేసారు. మనవడు బ్యాంక్ ఉద్యోగి కావడానికి సహాయం చేసారు.వీరి రెక్కల కష్టంతో వారికి భవిష్యత్తు చూపించారు.ఐతే అతని భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ తరువాత ఒక సంవత్సరం ఆ పెద్దాయన్ని కొడుకులు బాగానే చూసుకున్నారు. తర్వాత ఏమయిందో మరి సంపాదన లేదనుకున్నారో ఏంటో తెలీదు గాని అతడిని ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. కేవలం 5 kg ల రేషన్ బియ్యం, అప్పుడప్పుడు కూతుర్లు ఇచ్చే 50 ,100 తో అతను జీవిస్తున్నాడు. పింఛన్ రాయిస్తే టీచర్ కి గౌరవభంగం కలుగుతుందని కొడుకు అదికూడా లేకుండా చేసాడు.
గత కొంతకాలంగా ఆ తాత కాళ్ళు తిరిగేలా మండలంలోని ఆఫీసుల చుట్టూ తిరిగిన పట్టించుకునే నాధుడే లేడు. నేను ప్రస్తుతం వలంటీర్ గా చేస్తున్న..ఈ సందర్భంగా వాళ్ళ ఇంటి తలుపు తట్టినప్పుడు, నాకు విషయం చెప్పి చేతులు పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. అంత పెద్దాయన వెక్కి వెక్కి ఏడుస్తుంటే గుండె చివుక్కు మన్నది… తాత సర్టిఫికెట్లు అన్ని తీసుకుని చూస్తే అన్నిపక్కాగా ఉన్నాయి.. అయినప్పటికీ ఎందుకు రిజెక్ట్ లో ఉంది అని సెక్రటరీని అడగగా అన్నీచేసిన ఆయన ప్రజాసాధికార సర్వే లో పేరు లేదని అన్నాడు. దీనికి సంభందించి వీఆర్ఏ దగ్గరికి వెళ్తే ఆమె వేరేవాళ్ళ పేరు చెప్పగా అక్కడికి వెళ్తే రెండు నిముషాల్లో పని అయ్యింది. మొన్న మేమే స్వయంగా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తాత కు పెన్షన్ చేతిలో పెట్టా.. అంతే తాత మొహంలో పట్టలేని ఆనందం కనిపించింది ఎంతో సంతోషం అనిపించింది. కచ్చితంగా చేయాలి అనే మనసు లేక చేసే మనిషి లేక ఇన్ని రోజులు పట్టింది… నాకు మొదటిలో ఈ వలంటీర్ లు గా వెస్ట్ ఏమో అనే అనుమానం ఉండేది. కాని తాత మొహంలోని వెలుగు చూసాక ఈ సేవ గొప్పతనం కనిపించింది. ఇలా అర్హత ఉండి ఫలితాలు పొందలేని వాళ్ళు ఎంతో మంది ఎం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలానే ఉండిపోయారు. ఇది నిజంగా మాకు సేవభాగ్యమే అని చెప్పాలి. నిజంగా ఇది చదివితే వలంటీర్లను చులకనగా చూసినవారు కచ్చితంగా సిగ్గుపడతారు.