టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇంకా 5 వారాలు మాత్రమే ఉండడంతో మరింత జోష్ తో అభిమానులు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ తో అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అదేమిటంటే మంచి ఫేమస్ సీనియర్ ఆర్టిస్ట్ రవి నిన్న ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ షో టైటిల్ గెలిచే సత్తా ఎవరికి ఉంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఇద్దరి పేరులు లిస్టులో ఉన్నాయి. ఈ క్లారిటీ రావడానికి ముఖ్య కారణం కూడా రవి నే. గత వారం నామినేట్ లిస్టులో వరుణ్, శ్రీముఖి, రవి, బాబా భాస్కర్ ఉండగా అందులో రవి ఎలిమినేట్ అవ్వగా..మిగతా ముగ్గురులో భాస్కర్ మాస్టర్ కి అంతగా తెలుగు మట్లాడడం రాకపోవడం, ఈ మధ్యలో గొడవలు పెట్టడం తో అతనికి ఛాన్స్ లేదని చెప్పాలి. ఇక వీరిద్దరికీ బయట మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వీరిద్దరి మధ్యనే టైటిల్ కోసం పోటీ జరిగే అవకాసం ఉంది.
