తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మక పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ఆరు వందలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సుకోసం అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి పదమూడు వరకు హైదరాబాద్ డిజైన్ వీక్ గా ప్రకటించారు. దిన్ని తెలంగాణ ప్రభుత్వం ,ఇండియన్ డిజైన్ ఫోరం సంయుక్తంగా నిర్వహించే ఈ ఐదు రోజులల్లో వివధ రకాల అవగాహాన కార్యక్రమాలతో పాటు ఈవెంట్లతో ప్రజలను అలరించనున్నారు.