బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అయింది. సప్తగిరులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. ఏడుకొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమలేశుడు మలయప్పస్వామిగా రోజుగా వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తాడు. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఐదవ రోజు పంచమి రోజు జరిగే గరుడ సేవకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇక సెప్టెంబర్ 29 అంటే ఈ రోజు బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణం చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం చేయడం ఆనవాయి తీగా వస్తుంది. ఈ రోజు రాత్రి 7- 8 గంటల మధ్య కాలంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో వేదమంత్రోచ్ఛారణల మధ‌్య శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణం చేస్తుంటారు. ముందుగా పుట్టమన్ను సేకరించి, అందులో నవ ధాన్యాలను నాటుతారు. నవ ధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. ఇలా అంకురాలను మొలకెత్తించే కార్యక్రమం కావడం వల్లే ఈ క్రతువునకు అంకురార్పణం అని పేరు వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి ఒక రోజు ముందు అంకురార్పణం కార్యక్రమం చేపడుతున్నారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ మొక్కలను స్వామివారి పుష్కరిణీలో నిమజ్జనం చేస్తారు. ఇవాళ అంకురార్పణం, ధ్వజారోహనంతో తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. అక్టోబర్ 8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరుగనున్నాయి. రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలలో తొలి రోజు సీఎం జగన్ స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగున్నాయి.
Tags andhrapradesgh ankurarpanam sri vari brahmostavalu Tirumal Tirupati ttd
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023