టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది.
వెయిట్ లాస్ నిమిత్తం కలర్స్ సంస్థకు సదరు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో అతనికి తిరిగి చెల్లించాలని, అలాగే, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా విధించాలని ఆదేశించింది. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్త వహించాలని లేని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీస్ కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయస్థానం హెచ్చరించింది.