తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఏపీలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. .రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లోని ఉద్యోగాల్లో అన్యమతస్థులను అనుమతించేది లేదని, ఇక నుంచి హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవాలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేస్తుంటే వారిని వేరే శాఖాల్లో మార్పు చేయాలని ప్రభుత్వం దేవాదయశాఖకు స్పష్టమైన ఆదేశా లు జారీ చేసింది…తిరుమల తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాల్లో హిందూయేతరులు ఉంటే.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు విజిలెన్స్ శాఖకు అందిజేస్తే, నిజనిర్ధారణ చేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది . బ్రహ్మోత్సవాల వేళ హిందూ దేవాలయాల్లో హిందూవులకే ఉద్యోగాలు అంటూ…జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
