ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు స్వయంగా సీఎం జగన్ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ‌్యర్థులకు నియామక ప్రతాలు అందజేసిన అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఇక పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గాంధీ జయంతి అయిన అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి లక్షా పాతిక వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం పట్ల ఏపీ యువతలో హర్షం వ్యక్తం అవుతోంది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనలో నవశకానికి సీఎం జగన్ నాంది పలుకుతున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ఆయన జయంతి రోజునే ఈ గ్రామ, సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం విశేషం.
