మహిళలను ప్రధానంగా పట్టిపీడించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్..ప్రపంచంలోని అనేక దేశాల్లోనే కాదు..మన దేశంలోనూ చాలా మంది మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే.. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఛాతిపై ఉన్న చర్మం లోపలికి పోతుంది. చర్మం సొట్టలు పడుతుంది. ఛాతిపై చర్మం రంగు మారుతుంది. నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి ఊడి వస్తుంది. నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల్లో ద్రవం బయటకు వస్తుంటుంది ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించాలి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఆరంభంలోనే గుర్తించలేకపోవడం వల్ల, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రతి ఏటా మహిళలు పెద్ద సంఖ్యలో చనిపోతూనే ఉన్నారు. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ బ్రెస్ట్ కేన్సర్‌ను తగ్గించడానికి కొత్త మందు కనిపెట్టారు. దాని పేరు సీడీకే 4/6. ఈ మందు తీవ్రమైన హెచ్‌ఈఆర్ 2 కేన్సర్ కణాలను కూడా వ్యాపించకుండా, కణితులు పెరగకుండా పట్టి ఉంచుతుంది. అంతే కాకుండా ఇన్యూనో పవర్‌ను కూడా పెంచుతుంది. అలాగే బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకొంటుంది. ఈ మందు తయారీ కోసం శాస్త్రవేత్తలు కృత్రిమ కణజాలాలపై పరిశోధనలు నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఆరంభంలోనే గుర్తించడంతో పాటు ఈ మందును వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు..చూశారుగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని భయపడకండి..వెంటనే డాక్టర్లను సంప్రదించి..వారి సలహా మేరకు ఈ సీడీకే 4/6 మందును వాడితే..క్రమక్రమంగా వ్యాధి నయం అవుతుంది.ఓకేనా.