టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్న అలీ ఎలిమినేట్ అయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అందరి దృష్టి శ్రీముఖి పైనే ఉంది ఎందుకంటే తాను వేసుకున్న బట్టలతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై మళ్ళింది. తాను వేసుకున్న జీన్స్ స్టైలిష్ గా చిరిగిపోయి ఉంది. దీంతో నెటీజన్లు సెటైర్లు మొదలుపెట్టారు. అంతే ఇంకా అందరు అందుకున్నారు. పాపం శ్రీముఖి…వేసుకోడానికి సరైన బట్టలు కూడా లేవట అంటూ స్క్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు.