ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుండే తొలి అడుగు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తొలి నియామక పత్రం ముఖ్యమంత్రి చేతుల మీదగా విజయవాడలో ఇవ్వనున్నారు.అనంతరం జిల్లాలవారిగా ఎంపికైన వారికి అక్కడ కమిటీ ఆద్వర్యంలో మంత్రులు ఇవ్వనున్నారు.