ఆర్.నారాయణమూర్తి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్యులపై జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరిస్తారు. అందుకే ఈయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తారు. గత పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా సినీ సంస్కృతికి దూరం.. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి, పీపుల్స్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అందించారు. అందులో తాండవ జలాశయంలోని అదనపు జలాల సమకూర్చడనాకి విశాఖ జిల్లా చిన గోలుకొండపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిని ఏర్పాటు చేసి పైపు లైను ద్వారా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను అందించాలని కోరారు. నారాయణ మూర్తి వినతిపై వై.యస్. జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఆర్.నారాయణ మూర్తితో స్థానిక ఎమ్మెల్యేకూడా ఉన్నారు. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకునే కథానియకుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈసందర్భంగా పలు సమస్యలపై సీఎంతో నారాయణ మూర్తి మాట్లాడారు. తాండవ జలాశయంలోకి అదనపు జలాలను సమకూర్చడానికి విశాఖజిల్లా చిన గొలుగొండపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పద్దతిని ఏర్పాటు చేయాలని కోరారు. పైపులైన్ ద్వారా రిజర్వాయరులోకి గోదావరినీరు అందించాలని సీఎంను కోరారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికారికంగా 55వేలఎకరాలకు సాగునీరు అందుతుందని, అనధికారికంగా మరో 12వేల ఎకరాలకు సాగునీరు ఈ జలాశయం నుంచి అందుతుందన్నారు. అలాంటి రిజర్వాయర్ నీటిమట్టం అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని నారాయణమూర్తి తీసుకొచ్చారు. తాండవ జలాశయం గరిష్ట నీటిమట్టం 380 అడుగులుండగా రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఇప్పటివరకు చేరలేదు. ఈ క్రమంలో రైతులకోసం నారాయణమూర్తి సీఎంను కోరారు. గతంలో ప్రజా ప్రతినిధ్య చట్టంప్రకారం పార్టీ ఫిరాయింపులు నేరం అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో నారాయణమార్తి ధైర్యంగా ప్రశంసించారు.