ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే.. వచ్చేనెల అక్టోబర్ 1నుండి వారి బ్యాంకు అకౌంట్ లో జీతాలు వేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,92,848 మంది వాలంటీర్లు ఉండగా అందులో 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వారు ఆగష్టు 15నుండి సెప్టెంబర్ 30 వరకు చేసిన పనికి గాను ప్రభుత్వం వారికి 7500 రూపాయలు జీతం వారి ఖాతాలో వేయనున్నారు. ఇందులో కొందరికి కొన్ని సాంకేతిక కారణాలు లేదు వేరే వాటివల్ల ధ్రువపత్రాలు అందజేయని వారికి సప్లిమెంటరీ బిల్ ద్వారా జీతాలు అక్టోబర్ మొదటివారంలో వేయనున్నట్టు తెలిపారు.