ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు అంటున్నారు. ఇంతకీ ఆ టాబ్లెట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది…గ్యాస్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ వాడే ఆ టాబ్లెట్ పేరు. రాన్‌టాక్..(RANTAC). మనం తినే ఆహారం అరిగేందుకు, అలాగే కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదల కాకుండా నిరోధించేందుకు ఉపయోగించే ఈ రాన్‌టాక్ టాబ్లెట్‌లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. తాజాగా అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డీ.ఏ.) వారు ఈ రాన్‌టాక్ టాబ్లెట్‌లో ‘నైట్రోసోడైమిథైలమైన్’ (NDMA) అనబడే క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్‌లో NDMA ఉండాల్సిన మోతాదు కంటే ఎకువగా ఉందంట…అలాగే దీని తయారీలో ఏర్పడిన లోపం వల్ల ఈ కలుషిత మిత్రమం క్యాన్సర్ కు దారితీస్తుందని డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ రాన్‌టాక్ టాబ్లెట్ వాడకంపై ఆయాదేశాలు నిషేధం విధించేందుకు సమాయాత్తం అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రాంటాక్ టాబ్లెట్స్ 2020 -21 వరకు ఎక్స్పైరీ డేట్లు కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటికే శాండూజ్ ఫార్మా కంపెనీ ఈ రాంటాక్ టాబ్లెట్లను ఉపసంహరించుకుని నాశనం చేశారు. అయినా ఇంకా మనదేశంతో సహా కొన్ని దేశాల్లో చెలామణిలో ఉన్నాయి. ఈ రాన్‌టాక్ బదులుగా మార్కెట్లో గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గే మరెన్నో మందులు వాడితే బెటరని…ఎఫ్‌డీఎ సూచిస్తోంది. ఇక మీదట గ్యాస్ట్రిక్ కోసం మీరు మెడికల్ షాపులకు వెళితే రాన్‌టాక్ టాబ్లెట్ ఇస్తే వద్దని చెప్పండి. రాన్‌టాక్ బదులు వేరే రకం టాబ్లెట్స్ వాడడం బెటర్. చూశారుగా రాన్‌టాక్ టాబ్లెట్‌తో ఎలా క్యాన్సర్ థ్రెట్ ఉందో..సో..బీ అలర్ట్.
Home / LIFE STYLE / గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!
Tags cancer causes gastric problem HEALTH life style rantac tablet