Home / 18+ / బలిరెడ్డి మరణం చోడవరానికి తీరని లోటు.. సీఎం నివాళులు

బలిరెడ్డి మరణం చోడవరానికి తీరని లోటు.. సీఎం నివాళులు

వైయస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి సత్యారావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విశాఖ జిల్లాకు, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరనిలోటు అన్నారు.విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. వాకింగ్‌ చేస్తునపుడు వెనుకనుంచి బైక్‌ ఢీకొట్టింది.

 

తీవ్రంగా గాయపడిన సత్యారావును వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. బలిరెడ్డి మృతిచెందిన వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చోడవరం వెళ్లారు. బలిరెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బలిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat