ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని, ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ జగన్‌ను నిలదీశారు. గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ విమర్శించారు.
గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వాళ్లు మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడం చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇటువంటి పనులు చేయడం ఎంతో నీచమని ప్రశ్నించారు. గతంలోనూ గ్రామ వలంటీర్లపై చంద్రబాబు ఇదేవిధంగా మాట్లాడారు. వలంటీర్లకు పెళ్లిళ్లు అవ్వవని, పిల్లను ఎవరూ ఇవ్వరని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చంద్రబాబుకు వలంటీర్ల వ్యవస్థపై ఎంతో అక్కసు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వలంటీర్ల వ్యవస్థ సఫలీకృతం అయితే జగన్ కు మంచిపేరు వస్తుందనే కారణంతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది.