ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది.ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. కాగా అధికారికంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గాంధీ జయంతి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ వ్యవస్థ పని చేయడం ప్రారంభవుతుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. సోషల్‌మీడియాలో గ్రామవాలంటీర్లను కూలివాళ్లగా చిత్రీకరిస్తూ పోస్ట్‌లు పెట్టి పరువు పోగొట్టుకున్న చంద్రబాబు రానురాను అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఉదాహరణగా చూపిస్తూ..ఓ గ్రామవాలంటీర్ కోరిక తీర్చనందుకే సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు . గ్రామవాలంటీర్లంతా భర్తలు లేని సమయంలో ఇంటికి వెళ్లి..తలుపుకొడితే మహిళలకు రక్షణ ఉంటుందా అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంటే గ్రామవాలంటీర్లంతా రేపిస్ట్‌లు అన్న తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
ఒకవేళ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలుంటే..సరిదిద్దుకోమని చెప్పాలి కానీ..అసలు వ్యవస్థే వద్దనడం చంద్రబాబుకు స్థాయికి తగదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షా పాతిక వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఆ అక్కసు అంతా గ్రామవాలంటీర్లపై చూపిస్తున్నాడు. గ్రామవాలంటీర్లపై రేపిస్ట్‌లు అనే ముద్ర వేయడానికి కూడా వెనుకాడడం లేదు..ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుకు నెట్‌జన్లు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. అసలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు సాగించిన అరాచకాలు అంతా ఇంతా కాదు. అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వాలంటే కమీషన్, ఇండ్ల నిర్మాణం కోసం పేరు నమోదు చేస్తే 50 వేల కమీషన్, ప్రభుత్వ పథకాలు అందాలంటే కమీషన్..ఇసుకలో కమీషన్…ఇలా ప్రతివిషయంలో అడ్డగోలుగా దోచుకున్నది కాగా..ఆడవారిపై లైంగికవేధింపులకు పాల్పడేవారు. అనంతపురంలో తమను ప్రశ్నించిన పాపానికి తెలుగు తమ్ముళ్లు ఓ నిరుపేద మహిళను నడివీధిలో జుట్టుపట్టుకుని లాగి కొట్టారు. అలాగే వైజాగ్‌లో ఓ ల్యాండ్ కబ్జా చేసిన తెలుగు తమ్ముళ్లు తమను అడ్డుకున్న దళిత మహిళపై దాడి చేసి ఆమె వస్త్రాలను లాగి…అసభ్యంగా వేధించారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుతమ్ముళ్లు ఆడవారి మాన, ప్రాణాలతో చెలగాటం ఆడిన ఉదంతాలు ఎన్నో..అవన్నీ చూసిన చంద్రబాబు..గ్రామవాలంటీర్లు అంటే..తమ తెలుగు తమ్ముళ్లలాగే రేపిస్టులు అనుకుంటున్నాడేమో..అందుకే గ్రామవాలంటీర్లు భర్తలు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడితే మహిళల పరిస్థితి ఏంటీ అంటూ నీచంగా మాట్లాడుతున్నాడు. అయినా గ్రామవాలంటీర్ల వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదో ఒకటిరెండు చోట్ల జరిగిన వ్యక్తిగత తగాదాలను గ్రామవాలంటీర్లకు అంటగట్టి..వారిపై రేపిస్ట్‌లుగా ముద్రవేయడం చంద్రబాబు తగదు..అయినా గ్రామవాలంటీర్లు అంటే… జన్మభూమి కమిటీల పేరుతో ఆడవాళ్లపై అత్యాచారాలకు, భౌతిక దాడులకు తెగబడిన మీ తెలుగు తమ్ముళ్లు అనుకున్నావా…చంద్రం అంటూ నెట్‌జన్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు.