తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి త్వరలో బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలుత తల్లితెలంగాణ పార్టీ పెట్టి..తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్‌కు చెల్లెమ్మగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్‌కు దూరమైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మళ్లీ యాక్టివ్‌గా మారి…మహాకూటమికి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. అయితే టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో విజయశాంతి మళ్లీ సైలెంట్ అయింది. అయితే అడపాదడపా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్పా..పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుండడంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ విజయశాంతి వంటి నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు విజయశాంతిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు కమలనాథులు రాయబారం నెరిపారు. తమ పార్టీలో చేరితే మంచి గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారంట..దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం…విజయశాంతి బీజేపీలోకి చేరేందుకు ఓకే చెప్పారని..విశ్వసనీయ సమాచారం. తమ పార్టీలోకి చేరేందుకు అంగీకరించడంతో కమలనాథులు దసరా రోజే..రాములమ్మకు కాషాయకండువా కప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారంట..మొత్తంగా విజయశాంతి బీజేపీలో చేరితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే అని చెప్పకతప్పదు.