భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలనుచైతన్యవంతులను చేసాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది ఈయనే. స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లవారితో పోరాడిన విప్లవ వీరులలో భగత్ సింగ్ ఒకడు. ఆయన పేరు వింటే చాలు నవతరం యువకులకు రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఎన్నో ధైర్య సాహసాలతో తెల్లదొరలను పరిగెత్తించారు. అప్పట్లో ఆయనే పేరు వింటే తెల్లవారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. ఇక ఆయన మొదటిసారి గాంధీజీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు మొదటిసారి 1919లో జలియన్ వాలా బాగ్ సంఘటనలో బ్రిటిష్ వారిపై కోపం మొదలైంది.
ఇక తన కుటుంబ సభ్యులు భగత్ సింగ్ కి వయస్సు రావడంతో పెళ్లి చెయ్యాలని నిశ్చయించగా ఆ సమయంలో ఒక లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అందులో నా జీవితం దేశానికే అంకితం, నాకు ఎటువంటి కోరికలు లేవని రాసాడు. అంతే ఇంక అప్పటినుండి బ్రిటిష్ వారిపై హింసాత్మక ఉద్యమానికి తేరలేపాడు. ఆ సమయంలోనే లాలా లజపతి రాయ్ ని బ్రిటిష్ వారు లాఠీతో తల పగలగొట్టాడు. ఆయన మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు మరింత ఆగ్రహాని తెచ్చిపెట్టాయి. దాంతో 1929 లో వారిపై బాంబులు వేసారు. అనంతరం ఆ ముగ్గురు లొంగిపోయారు. అంతేకాకుండా నిజం ఒప్పుకోవడంతో వారికి ఉరిశిక్ష విధించారు.