రాష్ట్రవ్యాప్తంగా గ్రామవాలంటీర్లకు శుభవార్త వినిపించింది. వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటో తేదీన వారి గౌరవవేతనం జమ చేయనున్నట్టు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వీరిలో అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు వివరించారు.
వలంటీర్లకు ఒక్కొక్కరికి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ మధ్య కాలానికి చెల్లించాల్సిన రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్ 1నే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామన్నారు