వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి తిరుగులేని సుస్థిర ప్రభుత్వం గా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తన విజన్ తో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ కమిట్మెంట్ తో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ పై జగన్ దృష్టి పెట్టారు.. ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా పాలనలో పారదర్శకత లోపించకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అవినీతి విషయంలో జగన్ స్ట్రిట్ గా వ్యవహరిస్తున్నారు.
అవినీతికి పాల్పడే ఎవ్వరిపైనైనా చర్యలు తీసుకుంటామని, పాలన పారదర్శకంగా చేయాలని జగన్ సంకల్పించారు. ఈ క్రమంలో జగన్ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కొన్ని వందలకోట్ల రూపాయలు మేలు జరిగే విధంగా రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం.. భారతదేశంలో లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పని చేశారని చెప్పొచ్చు.. అలాగే ఉద్యోగుల జీతాల పెంపు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు..
ఈ క్రమంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా వందరోజులు పూర్తయిన అతి తక్కువ రోజుల్లోనే జగన్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించడం ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలు చేయడం, పబ్లిసిటీకి దూరంగా ఉండడం, పోలవరం వంటి అత్యంత ఆవశ్యకమైన ప్రాజెక్టులో ఆచితూచి అడుగులు వేయడం వంటి నిర్ణయాత్మక విధానాలతో దేశవ్యాప్తంగా జగన్ తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.