మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో నాలుగైదు స్టోరీలు అల్లుతున్నారంటూ ఆయన అంటూ మండిపడ్డారు.
ఐదేళ్ల తర్వాత జరిగే పెళ్లికి చూడటం దారుణం అన్నారు. పోలవరం లో మూడు టెండర్లు పూర్తయ్యాయని ఇంకా చంద్రబాబు, ఆయన బానిసలు చాలా చూడాల్సిఉందన్నారు. విద్యుత్ బిల్లులతో ప్రతి సంవత్సరం వేలకోట్లు ఖర్చవుతున్నాయన్నారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పబ్లిక్ గా చంద్రబాబు మాదిరిగా ఎవరు దోచుకోరని, రివర్స్ టెండరింగ్ తో అందరి అవినీతి బాగోతాలు సాక్షాలతో బయట పడుతాయన్నారు. చంద్రబాబెను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు.. ఇష్టానుసారంగా రివర్స్ టెండరింగ్ లకు వెళ్లొద్దని కాంట్రాక్టు సంస్థలను చంద్రబాబు బెదరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విజయసాయి తీవ్రంగా విమర్శించారు.